Article Health Disease %e0%b0%9a%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%8b %e0%b0%b8%e0%b0%a4%e0%b0%ae%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a4%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 110032500053_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చుండ్రుతో సతమతమౌతుంటే...

Advertiesment
చుండ్రు
FILE
తలలో చుండ్రు ఉంది అంటే అది ఓ రకమైన నిర్జీవ చర్మం. ఇది వెంట్రుకల కుదుళ్ళకు ఇరుపక్కల చేరుకుంటుంది. కాబట్టి మీ తల వెంట్రుకలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలంటున్నారు వైద్యులు. తలను దువ్వేటప్పుడు మెత్తటి, పల్చని దంతాలు కలిగిన దువ్వెనను ఉపయోగించాలి. దీంతో తలలోని వెంట్రుకలతో కూడుకునివున్న చుండ్రు బయటకు వచ్చేస్తుంది. దీంతోపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పనిసరిగా చుండ్రును మటుమాయం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* గోరువెచ్చగా కాచిన ఆలివ్ ఆయిల్‌లో కొన్ని చుక్కల అల్లం రసం కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు మర్ధనా చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి.

* వేపాకుల రసంలో నిమ్మకాయ రసం కలుపుకుని తలకు పూయండి. ఇలా అరగంటపాటు ఉంచండి. తర్వాత షాంపూను పూయండి. ఆ తర్వాత శికాకాయ, నిమ్మరసాన్ని సమపాళ్ళలో కలుపుకుని తలకు దట్టించండి. పది నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.

* వెంట్రుకలకు ప్రతి రోజు బ్రష్ చేయడం, తలకు మాలిష్ చేయడంతో చుండ్రు సమస్య తీరిపోతుంది. ఎందుకంటే దీనివలన తలలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి నిర్జీవ చర్మం బయటకు వచ్చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu