Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Cancer Day, కేన్సర్ లక్షణాలు ఏమిటి?

Advertiesment
World Cancer Day, కేన్సర్ లక్షణాలు ఏమిటి?
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:52 IST)
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ప్రతి 10 మందిలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిర్ధారించింది. అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్న సమయంలోనూ, వ్యాధి పూర్తిగా నయం చేయగలిగే సమయంలో, ఈ డేటా ఆందోళనకరంగా ఉందని ఆంకాలజిస్టులు అంటున్నారు.
 
మన దేశం విషయానికి వస్తే ప్రతి 10 మంది భారతీయుల్లో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతుంటే, వ్యాధి సోకిన 15 మందిలో ఒకరు చనిపోతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాణాంతక కేన్సర్‌కు కారణమేమిటో ఇప్పటివరకూ ఎవరూ స్పష్టంగా కనుక్కోలేకపోయారు. అయితే కేన్సర్‌కు దారితీసే కొన్ని అంశాలను మాత్రం కనిపెట్టారు. అవి ఏమిటో చూద్దాం.
 
1. పొగాకు వాడటం
2. మద్యపానం
3. వాతావరణంలో ఉండే గామా కిరణాలు, అల్ర్టావయొలెంట్‌ కిరణాలు శరీరానికి సోకడంవల్ల.
4. దైనందిన జీవితంలో మనం తాగే పానీయాలు, తినే ఆహార పదార్థాలలో కలిసిన కొన్ని రసాయనిక పదార్థాలవల్ల.
5. ఎండలో ఎక్కువగా తిరగడంవల్ల (చర్మం కేన్సర్‌ కలిగే అవకాశం)
6. కొన్ని రకాల వైరస్‌ల కారణంగా (హెచ్‌ఐవి, హెపటైటిస్‌ బి, హెర్పెస్‌ వంటి వైరస్‌లు)
 
కేన్సర్‌ అంటే?
మనిషి శరీరంలో కణవిభజన అనేది నిరంతర ప్రక్రియ. మన దేహంలో రోజూ 1012 కణాలు నిర్జీవమవుతూ ఉంటాయి. వాటి స్థానంలో అంతే సంఖ్యలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఒకవేళ- ఇలా కొత్తగా పుట్టే కణాల సంఖ్య, నిర్జీవమయ్యే కణాల సంఖ్యకంటే ఎక్కువగా ఉంటే, అలా ఆగకుండా జరుగుతుంటే దీనినే కేన్సర్‌ అంటారు.
 
కేన్సర్‌ లక్షణాలు:
1. అకస్మాత్తుగా తలనొప్పి కలగడం. వాంతులు, కంటిచూపు మందగించడం- ఈ లక్షణాలు బ్రెయిన్‌ ట్యూమర్‌ను వెల్లడిస్తాయి.
2. కంటిపై తెల్లటి పొర కనిపిస్తుంది (పిల్లి కళ్ళ మాదిరిగా)- ఇది రెటినా బ్లాస్టోమ్‌ అంటే కంటి కేన్సర్‌ తొలి లక్షణం.
3. నాలుక పక్కన పుండు ఏర్పడి, నోరు తెరవడం, నాలుక మెదపడం కష్టం కావడం- ఇది నాలుకపై వచ్చే కేన్సర్‌ ప్రాథమిక లక్షణం.
4. గొంతువాపు, తరచూ జ్వరం రావడం, చెమటలు పట్టడం- ఈ లక్షణాలు థైరాయిడ్‌ కేన్సర్‌ను బయటపెడతాయి.
5. అకస్మాత్తుగా మాటలో మార్పు రావడం, గొంతు మారడాన్ని బట్టి గొంతు కేన్సర్‌ (ప్రత్యేకించి స్వరపేటిక కేన్సర్‌)ను గుర్తించవచ్చు.
6. ఆహారం మింగడం కష్టం కావడం. ద్రవపదార్థాలను మింగడం కూడా కష్టంగా మారడాన్ని బట్టి ఈసోఫేగస్‌ కేన్సర్‌ (ఆహార నాళంలో కేన్సర్‌)ను గుర్తించవచ్చు.
7. జ్వరం, దగ్గుతో పాటు రక్తం పడటం- ఈ లక్షణాలు ఊపిరితిత్తుల కేన్సర్‌వి.
8. వక్షోజాలలో గడ్డ (కణితి) ఏర్పడడం, చనుమొన నుండి రక్తం కారడం- బ్లడ్ కేన్సర్‌ లక్షణాలు.
9. ఆకలి కలగకపోవడం, చెప్పలేని నీరసం, వాంతులు- స్టమక్‌ కేన్సర్‌ (ఉదర కేన్సర్‌) లక్షణాలు.
10. కడుపులో మంట, మల విసర్జన వేళల్లో మార్పు- కొలోన్‌ (పురీషనాళం) కేన్సర్‌ లక్షణాలు.
11. మలద్వారం నుంచి విపరీతంగా రక్తం పోవడం (ప్రత్యేకించి ఉదయం వేళల్లో)- మలద్వారంలో కేన్సర్‌ లక్షణం.
12. కడుపుకింది భాగంలో వాపు, బరువు కోల్పోవడం, అసహనం- ఒవేరియన్‌ కేన్సర్‌ (గర్భాశయ కేన్సర్‌) లక్షణాలు.
13. జ్వరంతో బాటు ఉదరభాగంలో వాపు (ప్రత్యేకించి చిన్నపిల్లల్లో)-విల్స్మ్‌ ట్యూమర్‌ లక్షణం.
14. జ్వరం లేకున్నా మూత్ర విసర్జన సమయంలో భరించలేని నొప్పి- ప్రోస్ట్రేట్‌ కేన్సర్‌ తొలి లక్షణం.
15. యోనిమార్గం ద్వారా రక్తం, తెల్లబట్ట ఎక్కువ కావడం- ఆడవాళ్ళలో సెర్విక్స్‌ కేన్సర్‌ లక్షణం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దగ్గుతో పాటు ఆయాసం కూడా తగ్గాలంటే?