డయాబెటిస్. ఈ వ్యాధి ఇప్పుడు మరింతగా విజృంభిస్తోంది. వ్యాయామానికి అవకాశం లేని ఉద్యోగాలు, అందులోనూ తీవ్రమైన ఒత్తిడితో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యాధి బారిన పడినవారు దీనిని అదుపులో పెట్టేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
ఆకుకూరలను అధికంగా తీసుకుంటూ వుండాలి.
కూరలో తక్కువ పిండిపదార్థం, కార్బోహైడ్రేట్లు వుంటాయి కనుక ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలి.
రాత్రి అల్పాహారంతో పాటు బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి.
జొన్నరొట్టెకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ప్రయోజనం వుంటుంది.
జామ, దానిమ్మ, రేగు, కమలాపండ్లను తినాలి.
ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా నడక తప్పకుండా చేయాలి.