అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారన్నది పక్కనపెడితే... విదేశీయులపైనే ఆయన దృష్టి ఎక్కువగా పెట్టినట్లు కనిపిస్తోంది. గురువారం జారీ చేసిన అమెరికా ప్రభుత్వ ఆదేశం ప్రకారం, అమెరికాలో నివసించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ పౌరులకు మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు ఉంటే తిరస్కరించబడవచ్చు.
ఈ మార్గదర్శకాలను విదేశాంగ శాఖ జారీ చేసింది. ఇది సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు దేశంలోకి ప్రవేశించినట్లయితే వారి వల్ల అమెరికా వనరులు దెబ్బతింటాయని ట్రంప్ భావిస్తున్నారట. అందుకే ఈ రెండు జబ్బులతో వచ్చేవారిని రిజెక్ట్ చేయాలని సూచించారు. ఈ మార్గదర్శకాలను కేబుల్ ద్వారా అమెరికన్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లకు పంపినట్లు తెలుస్తోంది.
వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి విషయంలో... దరఖాస్తుదారుడి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. హృదయ సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, మధుమేహం, జీవక్రియ వ్యాధులు, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య పరిస్థితులతో సహా మరికొన్ని క్రిటికల్ వ్యాధులుంటే వారి వీసాను తిరస్కరించవచ్చు.