సహజంగా అందరినీ పట్టుకుని వేధించే సమస్య జలుబు. ఈ జలుబు కొందరిలో వారంలో తగ్గిపోతుంది కానీ మరికొందరిలో బాగా ఇబ్బందిపెడుతుంది. ఈ జలుబును సింపుల్‌గా తగ్గించగల చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
ద్రవపదార్థాలు తీసుకుంటూ వుంటే జలుబును పారదోలవచ్చు.
వేడివేడిగా చికెన్ సూప్ తీసుకుంటే జలుబు కంట్రోల్ అవుతుంది.
గోరువెచ్చని నీటిలో కాస్తంత నిమ్మరసం పిండి సిప్ చేస్తుంటే తగ్గుతుంది.
తగినంత విశ్రాంతి తీసుకుంటుంటే జలుబును వదిలించుకోవచ్చు.
జలుబు చేసినప్పుడు గది వాతావరణం చల్లగా లేకుండా చూసుకోవాలి.
పావు టీ స్పూన్ ఉప్పును పావుగ్లాసు నీటిలో వేసి పుక్కిలి పట్టాలి. ఇది చిన్నపిల్లలకు పనికిరాదు.
ముక్కు దిబ్బడగా వుంటే వైద్యుని సలహా మేరకు నాసల్ డ్రాప్స్ వాడవచ్చు.