వర్షా కాలం వచ్చేసింది. దీనితోపాటు పలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు వుంటుంటాయి. సహజంగా రుతువులు మారినప్పుడు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలు తలెత్తేవరకూ వుండకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో వారందరికీ రోగనిరోధక శక్తి ఉసిరి ఇవ్వండి. ఉసిరిపొడిని పెద్దలు ఒక స్పూన్, పిల్లలు అరస్పూన్ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరికాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది.
ఆహారంలో అల్లం, వెల్లుల్లి భాగం చేసి క్రమం తప్పక తీసుకోండి. ఇవి యాంటీవైరస్, యాంటీ బ్యాక్టీరియల్ శక్తి కలిగినవి. వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం చేయడం, ఇంట్లో కర్పూరం వెలిగించడం ఆరోగ్యకరం. తులసి ఆకుల రసం తీసి త్రాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి పీలిస్తే ముక్కులో చేరిన వైరస్‌లు తొలగిపోతాయి. పసుపు చల్లి ఉడికించిన వంటకాలు, నల్ల మిరియాలు వాడిన వంటకాలు తినటం వల్ల రోగాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.