శరీరంలోని అన్ని అవయవాలలోకెల్లా నేత్రాలు చాలా ముఖ్యమైనవి. అయితే, నేత్రాలకు శుక్లాలకు ముప్పు వస్తుంది. వీటిని చాలా తేలికగా వదిలివేయడం వల్ల కంటి చూపును కోల్పోయే అవకాశం ఉంది.
ప్రధానంగా కంటిలోని కటకం పారదర్శకంగా ఉంటే చూపు స్పష్టంగా కనబడుతుంది. కానీ వృద్ధాప్యంలో ఈ కటకం మీద మందమైన పొర ఏర్పడి.. శుక్లాల సమస్యకు దారితీస్తుంది. దీంతో చూపు మందగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి దారితీస్తున్న కారణాల్లో ఇదే ప్రధానమైంది.
సాధారణంగా వయసుతో పాటే శుక్లం ముప్పూ పెరుగుతుంది. అంతమాత్రాన వృద్ధాప్యంలో ఇది అనివార్యమనుకోవటానికి వీల్లేదు. పర్యావరణ అంశాలతోనూ ఈ సమస్య రావొచ్చు. కాబట్టి ఆహార అలవాట్లను మార్చుకోవటం ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో కూడిన విటమిన్ 'సి' అధికంగా గల పదార్థాలను తినటం ద్వారా త్వరగా దీన్ని ఆలస్యం చేసుకోవచ్చు.