Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూత్రం ముదురు పసుపు రంగులో వుంటుందా?

Advertiesment
urine
, బుధవారం, 15 జూన్ 2022 (23:10 IST)
శరీరం విసర్జించే మూత్రం ద్వారా అనారోగ్య సమస్యలను చాలావరకూ పసిగట్టవచ్చు. ఏదైనా వ్యాధి ప్రారంభమైందంటే... మూత్రంలో రంగు- మార్పులను కనబరుస్తుంది. మూత్రం రంగు ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. శరీరం వివిధ పరిస్థితులకు భిన్నంగా స్పందిస్తుంది. మూత్రం రంగు ద్వారా గుర్తించబడుతుంది. మూత్రం రంగు మారడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

 
ముదురు పసుపు రంగు: మూత్రం ముదురు రంగులో అంటే ముదురు పసుపు రంగులో కనిపిస్తే, అది నీటి కొరత వల్ల కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఎక్కువ నీరు, ద్రవాలను తీసుకోవాలి.

 
ఎరుపు రంగు: మూత్రం ఎరుపు రంగులో వుంటే మూత్రంలో రక్తం లేదా మల పదార్థం ఉనికిని సూచిస్తుంది. ఈ సమస్య ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఎందుకంటే ఈ రక్తం కిడ్నీ, మూత్రాశయం, గర్భాశయం, రక్తపోటు వల్ల కావచ్చు.

 
ముదురు ఎరుపు లేదా నలుపు రంగు: ఈ రంగు అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇది కాలేయ వైఫల్యం, తీవ్రమైన కాలేయ ఇన్ఫెక్షన్, కణితులు, హెపటైటిస్ వంటి తీవ్రమైన సమస్యల వల్ల కూడా కావచ్చు. ఈ రంగు మూత్రం శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతుంది. కనుక మూత్రం రంగును అనుసరించి దాదాపుగా అనారోగ్య సమస్యలను అంచనా వేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాదములతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోండి