ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్. దీని లక్షణాలు చాలా సాధారణంగానూ, కొన్ని కేసుల్లో తక్కువ సాధారణంగానూ మరికొందరిలో తీవ్రమైనవిగా కనిపిస్తున్నాయంటున్నారు వైద్యులు.
అత్యంత సాధారణ లక్షణాలు ఎలా వుంటాయంటే... జ్వరం, దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం. ఇక తక్కువ సాధారణ లక్షణాలు ఎలా వుంటాయంటే, గొంతు నొప్పి, తలనొప్పి, వళ్లు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, వేళ్లు లేదా కాలి రంగు మారడం. ఎరుపు లేదా ఎర్రబారి వాచిపోయి వుండే కళ్ళు.
తీవ్రమైన లక్షణాలు విషయానికి వస్తే... శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం, మాట్లాడలేకపోవడం లేదా చలనం కోల్పోవడం. గందరగోళంగా అనిపించడం, ఛాతీ నొప్పి.
ఎవరికైనా ఈ లక్షణాలలో ఏవైనా ఉంటే, అతను/ఆమె అత్యవసరంగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. కొత్త కోవిడ్ వేరియంట్‌ని గుర్తించిన తర్వాత, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అనుసరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే చెప్పింది.