Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టైఫాయిడ్ ఎలావస్తుంది...?

Advertiesment
టైఫాయిడ్ ఎలావస్తుంది...?
, సోమవారం, 27 సెప్టెంబరు 2021 (07:31 IST)
టైఫాయిడ్ సోకిన వెంటనే వైద్య చికిత్స తప్పనిసరి. ఇంటి దగ్గర ఉంటూనే చికిత్స తీసుకోవచ్చు. వైద్యుడు ఇచ్చే మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. టైఫాయిడ్ సోకిన వారు ఆహారం విషయంలోను జాగ్రత్త అవసరం.
 
తేలికగా అరిగేవిధమైన ద్రవాహారాన్నే ఏక్కువగా తీసుకోవాలి. అంటే తగిన మోతాదులలో చల్లార్చిన గంజి, పాలు, నీళ్ళు కలిపిన అన్నం, పళ్ళ రసం, కొబ్బరి బొండాం నీళ్ళు, గ్లూకోస్, కోడి గ్రుడ్లు ఆహారంగా తీసుకోవచ్చు. జ్వరంవల్ల అధికంగా చెమటలు పోస్తూ ఉంటాయి, అందువల్ల తరచు రోగికి దాహంవేస్తుంది. నోరెండిపోకుండా కొద్దికొద్దిగా నీళ్లు ఇస్తూ ఉండాలి.
 
జ్వరం వచ్చిన తరువాత వారంరోజులు మామూలుగా స్నానం చేయవచ్చు. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తడి గుడ్డతో దేహాన్ని తుడవాలి రోగికి గాలి వీచే ప్రాంతంలో కూర్చోబెట్టాలి. తద్వారా జ్వరం త్రీవతను తగ్గించగలము. టైఫాయిడ్ సోకిన వారిలో కొందరికి విరేచనాలు, వాంతులు కూడా ఉంటాయి. అటువంటివారు పాలు తాగకూడదు. పాలను నిమ్మరసం పిండి, విరగ్గొట్టి- వడబోసిన ఆ విరుగుడు తేట మాత్రమే తీసుకోవాలి.
 
టైఫాయిడ్ లేదా సన్నిపాత జ్వరం శరీరంలో  బాక్టీరియా 3 వారాల వరకు నిద్రణమై ఉంటుంది. సాల్మోనెల్లా టైపై అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఈ జాతికి చెందినద పారటైపాయిడ్ అనే మరో జ్వరం కూడా ఉంది.
 
టైఫాయిడ్ లక్షణాలు:
ఆరంభంలో కొద్దిగా జ్వరం వస్తుంది. రోజు రోజుకి క్రమంగా జ్వరం ఎక్కువవుతూ వారం రోజుల్లో 104F- 40 డిగ్రీస్ సి   వరకు జ్వరం వస్తుంది ఆ సమయంలో తల నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. సకాలంలో చికిత్స జరిగిన ఈ వ్యాధి మరో రెండు మూడు వారాల దాకా శరీరంలో ఉంటుంది. టైఫాయిడ్ వ్యాధి క్రిములు నిరోధించ కాకపోయినా పక్షంలో వ్యాధి ముదిరి అంతర రోగాలు కూడా రావచ్చుమలబద్దకం, అకలి తగ్గిపోవటం, అతిసార, అలసట, న్యూమోనియా సంధించడం, హృదయం బలహీనపడటం.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరి చూర్ణంలో కొద్దిగా కొబ్బరినూనెను కలిపి...