Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ఆయన స్మోకర్... తరచూ నా పెదాలు లిప్ లాక్ చేస్తాడు... అనారోగ్యమా?

పొగత్రాగేవారి నోటిలో ప్రమాదకరమైన మెనింగొకొక్కస్ బ్యాక్టీరియా ఉంటుందనీ, ముద్దు పెట్టుకున్నప్పుడు అది లాలాజలం ద్వారా రెండో వ్యక్తి నోటిలోకి ప్రవేశించి రోగాన్ని కలిగిస్తుందని ఇంగ్లాండుకు చెందిన పరిశోధకుల

Advertiesment
మా ఆయన స్మోకర్... తరచూ నా పెదాలు లిప్ లాక్ చేస్తాడు... అనారోగ్యమా?
, శనివారం, 16 జూన్ 2018 (19:33 IST)
పొగత్రాగేవారి నోటిలో ప్రమాదకరమైన మెనింగొకొక్కస్ బ్యాక్టీరియా ఉంటుందనీ, ముద్దు పెట్టుకున్నప్పుడు అది లాలాజలం ద్వారా రెండో వ్యక్తి నోటిలోకి ప్రవేశించి రోగాన్ని కలిగిస్తుందని ఇంగ్లాండుకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఆ ప్రకారం చూస్తే స్మోకింగ్ చేసేవారి ముద్దు పెడితే అనారోగ్య సమస్య తప్పదన్నమాట.
 
భాగస్వామి/గాళ్ ఫ్రెండ్స్ విషయాన్ని ప్రక్కన పెడితో కొంతమంది పొగరాయుళ్లు చిన్నపిల్లలను ముద్దు చేస్తూ వారి ముఖాలపై ముద్దాడుతుంటారు. ఆ సమయంలో వారి నోటిలో ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియా చిన్నారుల్లోకి జొరపడుతుంది. దీని ప్రభావం మూలంగా పలువురు పిల్లలు మృతి చెందినట్లు తేలిందంటున్నారు.
 
పొగతాగే అలవాటున్న పురుషులు తమ భార్యకు గాఢ చుంబనాలను ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉన్న భార్యను అనారోగ్యంపాలు చేసినవారవుతారని అంటున్నారు. పొగత్రాగేవారి ముద్దే కాదు.. వారు గట్టిగా పీల్చి వదిలే పొగ లో కూడా వ్యాధికారక క్రిములు తిరుగాడుతుంటాయనీ, కనుక పొగరాయుళ్లు గుప్పు గుప్పుమనేటప్పుడు వారికి కాస్త దూరంగా ఉండటం ఎంతైనా మంచిది అంటున్నారు వైద్య నిపుణులు.
 
పొగరాయుళ్లు పెట్టిన ముద్దు మోసుకొచ్చే మెనింగొకొక్కస్ బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం తప్పదు. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే... అకాస్మాత్తుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, బలహీనమై పోవడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, ఆందోళన, కీళ్ల నొప్పులు, వాంతులు, వెలుతురు చూసేందుకు అయిష్టత, మెడ పట్టేయడం, శరీరంపై ఎరుపు రంగులో చిన్న చిన్న బొబ్బలు రావడం వంటి దుష్పరిమాణాలు చోటుచేసుకుంటాయంటున్నారు. కనుక పొగతాగేవారికి చాలా చాలా దూరంగా ఉండటం చాలా మంచిది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయాన్నే ఒకట్రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటే ఆ జబ్బు అదుపు