Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నైట్ డ్యూటీలు ఎక్కువగా చేస్తుంటాను.. ఉదయం వేళలలో తలనొప్పి?

Advertiesment
Headache
నా వయస్సు 28 యేళ్లు. ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నా. ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తుంటాను. నాకు ఇటీవల బాగా తలనొప్పి వస్తుంది. తల బాగా బరువెక్కినట్లు ఉంటుంది. ఒక్కోసారి తలనొప్పి ప్రారంభమై క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా తలనొప్పే కదా అంతగా పట్టించుకోలేదు. కానీ నెలరోజులుగా తలనొప్పి నన్ను బాధిస్తోంది. అప్పుడప్పుడు తగ్గి మళ్లీ వస్తోంది. తలనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతున్నాను. ఏకాగ్రతతో ఉద్యోగం చేయలేకపోతున్నాను. దీనికి కారణమేంటి? 
  
ఇలాంటి సమస్యలు ఉన్నవారు న్యూరాలజిస్టును సంప్రదించడం ఉత్తమం. ఉదయం లేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు వాంతులు అవుతున్నాయా లేదా గమనించండి. ఒకవేళ ఉదయం తలనొప్పితో పాటు వాంతులు అవుతుండటం, వాంతి చేసుకోగానే తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం వంటి లక్షణాలు కనిపిస్తే దానిని బ్రెయిన్ ట్యూమర్‌గా భావించాలి. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే వాంతి చేసుకున్న తర్వాత తలనొప్పి తగ్గి, సాధారణ స్థితికి చేరుకుంటారు. దాంతోపాటు చూపులో కూడా తేడా వస్తుంది. మనకు కనిపించే వస్తువులు కూడా అస్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు ఉంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

Share this Story:

Follow Webdunia telugu