Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్యం గర్భనిరోధక మాత్రలు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

మనిషి శరీరం ఒక పెద్ద మిషనరీ. శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాల్సిందే. లేకుంటే వ్యాధుల బారిన పడిపోవాల్సిందే. అప్పుడప్పుడు వచ్చి పలుకరించి పోయే దగ్గు, జలుబు వంటి వాటికి వాతావరణ పరిస్థితులు, తీసుకునే ఆహారమే ప్రధాన కారణం అవుతుంది. వీటిని ఈజీగా తగ్గి

Advertiesment
నిత్యం గర్భనిరోధక మాత్రలు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?
, సోమవారం, 22 జనవరి 2018 (19:06 IST)
మనిషి శరీరం ఒక పెద్ద మిషనరీ. శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాల్సిందే. లేకుంటే వ్యాధుల బారిన పడిపోవాల్సిందే. అప్పుడప్పుడు వచ్చి పలుకరించి పోయే దగ్గు, జలుబు వంటి వాటికి వాతావరణ పరిస్థితులు, తీసుకునే ఆహారమే ప్రధాన కారణం అవుతుంది. వీటిని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇక మొండి జబ్బులు రావడానికి అసలు కారణం మన లైఫ్ స్టైల్, అలాగే అవయవాల పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇంకా కుటుంబ చరిత్ర. ఇక అత్యంత ప్రమాదకరంగా వచ్చే వ్యాధి పెరాలసిస్. అవును పక్షవాతం స్ట్రోక్ వచ్చిందంటే బాడీ నిస్సత్తువైపోతుంది. పెరాలసిస్ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. 
 
పక్షవాతం.. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. మెదడుకు రక్తసరఫరా అంతరాయం ఏర్పడి ఈ వ్యాధి వస్తుంది. అలాగే పోలియో వంటి వైరెస్ సంబంధిత రోగాలు, కొన్ని విష పదార్థాలు కూడా కారణమవుతాయి. నిత్యం గర్భనిరోధక వార్తలు వాడే మహిళల్లో కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకను 32 వేల నాడీ కణాలు మెదడులో చనిపోతాయి. ఈ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. 
 
అదే సమయంలో నాడీ కణాలు, న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణలు నిలిచిపోతాయి. అంతే సమయంలో మెదడు ఆలోచనలు కూడా నిలిచిపోతాయి. మెదడుకు వెళ్ళాల్సిన రక్త సరఫరా నిలిచి రక్తపు గడ్డల్లా మారిపోతుంది. పక్షవాతం వచ్చే ముందు ఒక కాలు, ఒక చేతికి తిమ్మిర్లు రావడం, ఒక చేతి, ఒక కాలిలో శక్తి తగ్గినట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే సరిగ్గా మాట్లాడలేరు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోతారు. చూపు మసకబారుతుంది. నడవాలని లేచినప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఈ లక్షణాలు వస్తాయో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడ్ని సంప్రదించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శెనగలతో పిల్లల కోసం టేస్టీ చాట్