Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

ఒక్క పిజ్జా తింటే నాలుగు కిలోమీటర్లు వేగంగా నడవాలట.. (video)

ఆహారపు అలవాట్లలో మార్పు, ఫాస్ట్ ఫుడ్‌ను తెగ లాగించడం ద్వారా గుండెపోటు ఏర్పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడంతో పాటు ఫాస్ట్ ఫుడ్‌ అధికంగా తీసుకోవడం ద్వారా అ

Advertiesment
Fast Food
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (17:43 IST)
ఆహారపు అలవాట్లలో మార్పు, ఫాస్ట్ ఫుడ్‌ను తెగ లాగించడం ద్వారా గుండెపోటు ఏర్పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడంతో పాటు ఫాస్ట్ ఫుడ్‌ అధికంగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ కేవలం రుచినిస్తాయే కానీ.. ఆరోగ్యానికి మేలు చేయవు. 
 
అధిక కేలరీలు కలిగిన ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పవు. సంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు పారిపోతాయి. కానీ పాశ్చాత్య ఆహారానికి అలవాటుపడి బర్గర్లు, పిజ్జాలు తింటూ అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు చాలామంది. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే పిల్లల్లోనూ, పెద్దల్లోనూ వ్యాధులు తప్పవు. 
 
ఒక పూర్తి పిజ్జాను తింటే శరీరంలో చేరే కేలరీలను ఖర్చు చేసేందుకు నాలుగు కిలోమీటర్ల మేర వేగంగా నడవాల్సి వుంటుంది. కానీ మనం ఒక్క కిలోమీటరైనా నడుస్తున్నామన్నా అనేది గుర్తు చేసుకోవాలి. అలాంటప్పుడు అధిక కేలరీలు వున్న ఆహారాన్ని తీసుకుంటే.. శరీరంలో కొవ్వు చేరక ఏం చేస్తుందని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అందుకే పోషకాలతో నిండిన మితాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా రెడీమేడ్ ఫుడ్స్ ఇన్సులిన్ ఉత్పత్తికి అడ్డంగా పరిణమిస్తాయి. తద్వారా మధుమేహం తప్పదు. అధిక కొవ్వుతో ఒబిసిటీ తప్పదు. చిన్నారులు అధికంగా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. పెరుగుదలకు అవసరమైన పోషకాలు లభించవు. ఫలితంగా వారిలోనూ ఊబకాయం ఆవహిస్తుంది. జంక్స్ ఫుడ్స్ తినే మహిళల్లో నెలసరి సమస్యలు ఏర్పడుతాయి. అలాగే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా గుండెపోటు ఏర్పడే ప్రమాదం వుంది. ఫాస్ట్ ఫుడ్స్‌లో వుండే ఉప్పుతో హైబీపీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులికి, మేకకు తేడా ఏంటి?