Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీపీకి చెక్ చెప్పే ''పగటి నిద్ర ''

Advertiesment
BP control with day sleep
, బుధవారం, 18 మే 2016 (18:28 IST)
పగలు పడుకోవడం మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. అధిక రక్తపోటుతో బాధపడేవారు పగటి పూట 45 నిమిషాలు నిద్రపోతే రక్తపోటు వెంటనే నియంత్రణలోకి వస్తుందని తాజా పరిశోధనలో వెల్లడయింది. ముఖ్యంగా ఒత్తిడికి గురయినపుడు ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుందని ఇందులో నిరూప‌ణ అయ్యింది. పెన్సిల్వేనియాలోని అల్లెగెనీ కాలేజ్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో భాగంగా 85 మంది ఆరోగ్యవంతులైన విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి అధ్యయనం చేశారు.
 
ఒక గ్రూపు వారికి ప్రతి రోజు గంట పాటు మధ్యాహ్నం నిద్రపోయే వెసులుబాటు కల్పించారు. మరొక గ్రూపుకు నిద్రపోయే అవకాశం ఇవ్వకుండా ఏదో ఒక పని చెబుతూ వచ్చారు. తరువాత వారిని రక్తపోటు పరిశీలిస్తే 45 నుంచి 60 నిమిషాల పాటు నిద్రపోయిన వారి రక్తపోటు చాలా తక్కువగా ఉంది. తమ పరిశోధనల్లో వెల్లడయిందేమిటంటే మధ్యాహ్నం నిద్ర వల్ల కార్డియో వాస్క్యులర్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ తగ్గిపోతుందని పరిశోధనలో పాలుపంచుకున్న ర్యాన్ బ్రిండిల్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖంపై మురికికి పెరుగు ప్యాక్‌తో మటుమాయం!