Article General Knowledge %e0%b0%b9%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%8b%e0%b0%aa%e0%b1%8a%e0%b0%9f%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d %e0%b0%b2%e0%b1%81 %e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 108100600029_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"హిప్పోపొటమస్"లు అంటే?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ హిప్పోపొటమస్ ఆకారం నీటి గుర్రాలు ఆఫ్రికా దేశం ఉభయచర జీవులు నీరు భూమి జంతువు
WD PhotoWD
పిల్లలూ...! "హిప్పోపొటమస్"లు అంటే ఏంటో మీకు తెలుసా..? పెద్ద పెద్ద ఆకారాలతో ఉండే నీటి గుర్రాలనే హిప్పోపొటమస్‌లు అంటారు. ఇవి ఆఫ్రికా దేశానికి చెందిన ఉభయచర జీవులు. అంటే నీటిలోనూ, భూమిపైన నివసించగలిగే జంతువులన్నమాట...!

ఈ హిప్పోపొటమస్‌లు రాక్షసాకారంతో, చూడగానే మనం భయపడేటట్లుగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం నీటిలోనే గడుపుతాయి. కేవలం ఒక ముక్కు మాత్రమే బయటకు కనిపించేలా ఉంచుకుని ఇవి నీటిలో గంటలు, గంటలు అలా తేలుతూనే గడిపేస్తాయి. అయితే... చూసేందుకు భయపెట్టేలా ఉన్నప్పటికీ ఇవి శాకాహారం మాత్రమే తీసుకుంటాయి.

ఇకపోతే... ఎప్పుడూ నీటిలో ఉండే హిప్పోపొటమస్‌లు రాత్రిపూట నీటినుంచి బయటకు వచ్చి పచ్చికను మేస్తాయి. మగ హిప్పోపొటమస్‌లు దాదాపు నాలుగు టన్నుల బరువు ఉంటాయి. భారీ శరీరం కలిగినప్పటికీ వీటి కాళ్ళు చాలా పొట్టిగా ఉంటాయి. వీటి సహాయంతో అవి సునాయాసంగా నీటిలో ఈదుతూ ఉండిపోతాయి.

అన్నట్టు పిల్లలూ... హిప్పోపొటమస్‌లు నీటిలోనే పిల్లలను కంటాయి కూడా. అన్నింటికంటే విశేషం ఏంటంటే... వీటి పిల్లలు నడక నేర్వడం కంటే ముందుగా... నీటిలో ఈదటాన్ని నేర్చుకుంటాయట..!

Share this Story:

Follow Webdunia telugu