Publish Date: Mon, 20 Oct 2008 (13:45 IST)
Updated Date: Mon, 20 Oct 2008 (13:44 IST)
పిల్లలూ..! హార్మోన్‌ల విధుల ఏంటి? అవి ఎందుకు విడుదల అవుతాయి? అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మన శరీరంలో జరిగే వివిధ ప్రక్రియలను "జీవక్రియలు" అని అంటారు. ఇవి నిరంతరం జరుగుతూనే ఉండాలి.
ఉదాహరణకు మన రక్తంలో ఎక్కువైన "గ్లూకోజ్ స్థాయి" తిరిగి సాధారణ స్థాయికి తగ్గుతూ ఉండటం. ఇది నిరంతరం జరగాల్సిన ఓ జీవక్రియ. దీర్ఘకాలం పాటు మన శరీరంలో జరిగే ఇలాంటి జీవ క్రియలను "హార్మోన్"లు నియంత్రిస్తాయి. ఇదే హార్మోన్ల ప్రధాన విధి.
ఈ హార్మోన్‌లు అనేవి మానవ శరీరంలోని అంతస్రావీ గ్రంథుల నుండి విడుదల అవుతాయి. హార్మోన్‌లను "రసాయన వార్తా వాహకాలు (కెమికల్ మెసెంజర్స్)" అని కూడా అంటారు. గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే ప్రధానమైన హార్మోన్ "ఇన్సులిన్". ఇది మధుమేహ వ్యాధిగ్రస్థులకు (షుగర్ పేషెంట్స్) ఎంతగానో ఉపయోగపడుతుంది.