Article General Knowledge %e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%82%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81 %e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 108080100035_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుప్రీంకోర్టు అంటే...!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ సుప్రీంకోర్టు భారతదేశం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి రాష్ట్రాలు క్రిమినల్ కేసులు
FileFILE
మన భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా పైననే రాష్ట్రపతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు.

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి, 26 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఇది భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను, పరిష్కరిస్తూ ఉంటుంది.

సివిల్ కేసులయినా, క్రిమినల్ కేసులయినా, ఇతర ఏ కేసులయినా హైకోర్టు‌లో విచారణ జరుగుతున్నా లేదా ఆఖరి తీర్పు అప్పటికే వచ్చేసి ఉన్నా, చివరగా న్యాయం కోసం ఈ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసుకోవచ్చు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవికి ఉండాల్సిన అర్హతలేంటంటే.... భారతదేశ పౌరుడై ఉండాలి. కనీసం 5 సంవత్సరాల కాలం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. లేకుంటే... 10 సంవత్సరాలు హైకోర్టులో అడ్వకేట్ వృత్తి నిర్వహించి ఉండాలి లేదా ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త అయి ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu