Publish Date: Mon, 22 Sep 2008 (14:10 IST)
Updated Date: Mon, 22 Sep 2008 (14:10 IST)
పిల్లలూ..! సముద్రం గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. సాధారణంగా సముద్రం పైనుండే నీటి గురించే మనకందరికీ తెలుసు. అసలు సముద్రం అట్టడుగు భాగంలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!సముద్ర జలాలపై పడే సూర్యకాంతిలో కొంత భాగం నీటి ఉపరితలంపైనే పరావర్తనం చెంది వాతావరణంలోకి వెళ్లిపోతుంది. ఇంకొంత భాగం సూర్యకిరణాలు వక్రీభవనం చెందే కోణాన్ని బట్టి, నీటి ఉపరితల భాగంలోనే సమాంతరంగా వ్యాపిస్తుంది. సూర్యరశ్మిలోని మరికొంత భాగం సముద్ర జలాల్లోని వివిధ పదార్థాలచే పీల్చుకోబడుతుంది.| ఆరొందల మీటర్ల లోతుకెళ్తే..! |
|
| 200 మీటర్ల లోతు దాటేసరికి, మిగతా అన్ని రంగులూ పీల్చుకోబడి కేవలం నీలం రంగు మాత్రమే కనిపిస్తుంటుంది. ఇక 600 మీటర్ల లోతుకు వెళ్తే మాత్రం అది కూడా కనిపించకుండా పోతుంది. ఆ తరువాత అక్కడి నుంచి సముద్రం అట్టడుగు భాగందాకా చిమ్మచీకటి రాజ్యమేలుతుంది... |
|
|
వీటన్నింటినీ అధిగమించి నీటిలోనికి దూసుకుపోయే సూర్యరశ్మి మాత్రమే సముద్రంలో కొంత లోతుదాకా వెళ్తుంది. అయితే ఈ కాంతి కూడా క్రమేణా శోషణకు గురవుతూ, ఒక స్థాయి వచ్చేసరికి పూర్తిగా అంతరించి పోతుంది. అంటే సముద్రం అడుగుభాగం మొత్తంగా చీకటిగా ఉంటుందని అర్థం.
సాధారణంగా సముద్ర జిల్లాల్లో 50 మీటర్ల లోతుకు వెళ్లేసరికి ఎరుపురంగు పూర్తిగా పీల్చుకోబడితే... వంద మీటర్ల లోతుకు వెళ్తే పసుపురంగు కూడా శోషణానికి గురవుతుంది. ఇక 200 మీటర్ల లోతు దాటేసరికి, మిగతా అన్ని రంగులూ పీల్చుకోబడి కేవలం నీలం రంగు మాత్రమే కనిపిస్తుంటుంది. ఇక 600 మీటర్ల లోతుకు వెళ్తే మాత్రం అది కూడా కనిపించకుండా పోతుంది. ఆ తరువాత అక్కడి నుంచి సముద్రం అట్టడుగు భాగందాకా చిమ్మచీకటి రాజ్యమేలుతుంది.
ఖండాల తీరం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం దాకా సముద్రం ఏమంత లోతుగా ఉండదు. కాబట్టి ఈ ప్రాంతంలో సముద్రం అడుగున కూడా ఏదో ఒకరకమైన వెలుతురు తప్పకుండా ఉంటుంది. అయితే అక్కడ కూడా 600 మీటర్లు లోతును దాటితే మాత్రం చీకటి మనకు దర్శనమిస్తుంది. కాగా, భూగోళంపై మనకు కనిపించే సముద్ర జలాల విస్తీర్ణంలో 80 శాతం భాగం అడుగు భాగాన చిమ్మచీకటిగా ఉంటుందన్నది మాత్రం వాస్తవం.