Article General Knowledge %e0%b0%b7%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b1%81%e0%b0%b2 %e0%b0%b8%e0%b0%82%e0%b0%97%e0%b0%ae%e0%b0%82 %e0%b0%89%e0%b0%97%e0%b0%be%e0%b0%a6%e0%b0%bf 108040500028_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షడ్రుచుల సంగమం ఉగాది

Advertiesment
రోజూ జాతీయ అంతర్జాతీయ విషయాలు మరి మన తెలుగు పండుగల గురించి తెలుసుకుందామా ! పండుగలు అంటే అందరికీ సంబంధించినవి కదా..
హాయ్ పిల్లలూ ఎలా ఉన్నారూ? మీరు రోజూ జాతీయ, అంతర్జాతీయ విషయాలు తెలుసుకుంటున్నారు కదా ! మరి కాసేపు మన తెలుగు పండుగల గురించి తెలుసుకుందామా ! పండుగలు అంటే అందరికీ సంబంధించినవి కదా.. మరి ఈ తెలుగు పండుగలేంటని అడుగుతున్నారా ? అన్ని పండుగలు అన్ని భాషల వారు జరుపుకుంటారు నిజమే... అయితే మన తెలుగు వారి పండుగల చిట్టాలో ఉగాది ముఖ్యమైనది.

ఇది పూర్వ కాలంలో 'యుగాది'గా పిలువబడేది. అంటే యుగానికి ఆదిగా దీనికి నిర్వచనం అన్నమాట. కాలక్రమంలో ఉగాదిగా మారిపోయింది. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటిన ప్రారంభం అవుతుండగా, మన తెలుగు సంవత్సరాది చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. దీనినే ఉగాది అని అంటారు. ఏప్రిల్, మార్చ్ నెలలలో వస్తుందీ పండుగ.

ఈ పండుగతో మనకు కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు వరుసగా పర్వదినాలు కూడా వస్తాయి. రుతువులలో మొదటిది వసంత రుతువు. అలాగే మాసాలలో మొదటిది చైత్ర మాసం. వసంత రుతువులో కోయిలలు కూస్తాయి. చెట్లు చిగురులు తొడుగుతాయి. క్రమంగా చెట్లు పూత పూసి కాయలు కాస్తాయన్న విషయం మనకు తెలిసిందే.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ పండుగ నాడు ఉగాది పచ్చడి చేస్తారు. కొత్తగా చెట్లకు కాసిన మామిడి పండ్లు. వేప పూవు, బెల్లం, కొత్త చింతపండు పులుసు, అరటి పండు ముక్కలు, జామపండు ముక్కలు, ఉప్పు, చిటికెడు కారాలను కలిపి దీనిని తయారు చేస్తారు. దీనిని ఉగాది పర్వదినాన అందరూ సేవిస్తారు.

ఉగాది పచ్చడిలో ఉండే వివిధ రకాల రుచుల లాగానే జీవితం కూడా షడ్రుచుల సంగమమని గుర్తు చేసుకునేందుకు ఈ పచ్చడిని తయారు చేసుకుని తింటారు. అలాగే సంవత్సరమంతా ఎదురయ్యే కష్టాలు, సుఖాలను సరిసమానంగా చూస్తూ జీవనం సాగించాలన్న నీతి ఈ పచ్చిడికి సంబంధించిన ఆచారంలో మనకు కన్పిస్తుంది. అంతే కాకుండా వేప పూవు చేదు, మామిడి పులుపు మన ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు. మరి పిల్లలూ ఉగాది పండుగ ప్రాశస్త్యం తెలిసిందిగా? తప్పకుండా ఉగాది నాడు మీ ఇంట్లో చేసే ఉగాది పచ్చడి తినండి.

Share this Story:

Follow Webdunia telugu