Article General Knowledge %e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d %e0%b0%a1%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80 %e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%80%e0%b0%ae%e0%b1%8c%e0%b0%9c%e0%b1%8d 108082000032_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాల్ట్ డిస్నీ.. మిక్కీమౌజ్....!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ కోపం విషాదం జంతువులు నవ్వు సంతోషం విచారం అనుభూతులు వాల్ట్ డిస్నీ మిక్కీమౌజ్
FileFILE
మనుషుల్లో కోపం, విషాదం అనేవి మనకు తెలుస్తాయి. మరి జంతువులు కూడా నవ్వుతాయా? వాటిలోని సంతోషం, విచారం లాంటివి మనకెలా తెలుస్తాయి?.... అనిపిస్తుంటుంది కదూ..!

జంతువులకు కూడా అన్ని రకాల అనుభూతులు ఉంటాయని ప్రపంచానికి తెలియజెప్తూ... 'వాల్ట్ డిస్నీ' అనే అమెరికన్ కార్టూనిస్టు వ్యంగ్య చిత్రాలను గీసి చూపించారు. ఈయన చిట్టెలుకను అనేక రకాలుగా గీసి చిన్నారుల మనసును దోచుకున్నాడు కూడా...! చిట్టెలుకే ప్రస్తుతం "మిక్కీ మౌజ్"గా అందరికీ చిరపరిచితమే..!

డిస్నీ గీసిన కార్టూన్లు పిల్లలతో పాటు పెద్దలందరికీ కూడా నచ్చడంతో వాటిని తెరమీద కదిలించే పనికి శ్రీకారం చుట్టాడు. దానికి యానిమేషన్ అని ముద్దుపేరు పెట్టుకున్నాడు. ఆడే, పాడే జంతువులతో యానిమేషన్ సినిమాను తీసి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచాడు. ఆతరువాత ఆయనకు తిరుగులేకుండా పోయింది.

జంతువుల నడుమ పుట్టి పెరిగి వాటిని కాపాడే పిల్లవాడి కథతో తీసిన "జంగిల్‌బుక్", అడవిలో అల్లకల్లోలం చేసే "లయన్ కింగ్" లాంటి యానిమేషన్ సినిమాలు వాల్డ్‌డిస్నీ రూపొందించినవే...! అవి ప్రపంచమంతా కూడా సూపర్ హిట్ చిత్రాలే...! డిస్నీ తన కార్టూన్ క్యారెక్టర్లతో ఓ అందాల పార్క్‌ని నిర్మించాడు. దానిపేరే... "డిస్నీ ల్యాండ్". ఇది బాలల "స్వర్గం" అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu