Publish Date: Mon, 04 Aug 2008 (13:46 IST)
Updated Date: Mon, 04 Aug 2008 (13:46 IST)
పిల్లలూ...! లేజర్ పెన్ను గురించి మీరెప్పుడైనా విన్నారా...? ఇది కూడా మనం సాధారణంగా రాసే పెన్నంత సైజులోనే ఉంటుంది. బ్యాటరీ సహాయంతో ఇది పని చేస్తుంది.
ఈ లేజర్ పెన్ను నుంచి చాలా శక్తివంతమైన కాంతి కిరణాలను ప్రసరింపజేయవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఏదైనా ప్రోగ్రామ్ గురించి పెద్ద స్క్రీన్ మీద పవర్ పాయింట్ ద్వారా వివరిస్తుంటారు కదా...! అలాంటి సమయంలో వారు స్క్రీన్‌మీది ఏదేని అంశాన్ని చూపించాలంటే ఈ పెన్ సాయంతో చూపిస్తారు.
ఈ లేజర్ పెన్ను నుండి చిన్న బొట్టుబిళ్లంత సైజులో వెలువడే కాంతి కిరణాలను చాలాదూరం వరకు ప్రసరింపజేయవచ్చు. అయితే, సాధారణంగా మనం పెన్నుతో రాసే విధానానికి లేజర్ పెన్ను పూర్తి భిన్నమైంది. ఒక చిన్న లేజర్ డయోడ్‌ను ఉపయోగించి ఈ లేజర్ డాట్ (కాంతి) రూపొందించబడుతుంది.
ఆఫీసు ప్రజెంటేషన్లకు ఇవి అద్భుతమైన సాధనంగా ఉపకరిస్తుండటంతో.... కార్పొరేట్ సంస్థలు ప్రస్తుతం ఉద్యోగులకు, యాజమాన్యానికి ఈ లేజర్ పెన్నులను బహుమతిగా ఇస్తున్నారు.