Article General Knowledge %e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e2%80%8c%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d %e0%b0%b8%e0%b1%8a%e0%b0%b8%e0%b1%88%e0%b0%9f%e0%b1%80 %e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 108092500042_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెడ్‌క్రాస్ సొసైటీ అంటే...?

Advertiesment
రెడ్క్రాస్ సొసైటీ అంటే
FileFILE
పిల్లలూ...! "రెడ్‌క్రాస్ సొసైటీ" ఈ పేరును ఎప్పుడైనా విన్నారా? అసలు రెడ్‌క్రాస్ సొసైటీ అంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది? అన్న విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం...

యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.

1895వ సంవత్సరంలో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు అసువులు బాయగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకుని, వారికి సేవలందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.

ఆ సంఘటన తరువాత... తానే ఇలాంటి వారికోసం ఓ సేవాసంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆలోచనలో పడ్డాడు హెన్రీ డునాంట్. అతని ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్నిరకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu