Article General Knowledge %e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%82 %e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%80%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 %e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 108101300035_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"మౌనం అర్థాంగీకారం" అంటే..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పిల్లలు సమాజం మౌనం అర్థం అంగీకారం మనుషులు హావం భావం మనస్తత్వం పూర్వ కాలం
WD PhotoWD
పిల్లలూ... సమాజంలో మనుషుల హావభావాలను, మనస్తత్వాలను విశ్లేషిస్తూ పూర్వకాలం నుంచీ అనేక రకాల సామెతలు వాడుకలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే.. ఈ "మౌనం అర్థాంగీకారం" అనే సామెత. దీని గురించి కాస్తంత విపులంగా తెలుసుకుందామా...!

చాలా సందర్భాలలో మనుషులు ఎదుటి వ్యక్తులకు తమ మనసుల్లోని మాటలను పూర్తిగా చెప్పేందుకు ఇష్టపడరు. కానీ వారి మనసులో సందర్భానికి తగినట్లుగా నడుచుకుంటే బాగుంటుందనే ఆలోచన మాత్రం ఉంటుంది. ఇలాంటివారు ఇవతలి వ్యక్తులు ఎన్నిరకాలుగా, ఎన్నసార్లు విషయాన్ని తేల్చి చెప్పమన్నా, చెప్పకుండా మాట దాటేస్తూనే ఉంటారు.

అడిగిన వ్యక్తులు గుచ్చి గుచ్చి మరీ ప్రశ్నిస్తే... వీరు ఔననీ, కాదనీ నోటితో చెప్పకుండా మౌనం వహిస్తుంటారు. ఈ మౌనం వారు తమ అంగీకారాన్ని సగం వరకూ తెలిపినట్లుగా అవతలివారు భావించుకోవచ్చు. ఎందువల్లనంటే... అడిగిన విషయం అస్సలు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చాలామంది తెగేసి చెబుతుంటారు.

అలా కాకుండా మౌనం వహించారంటే మాత్రం... ఆ విషయాన్ని కొంతవరకైనా ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవచ్చని పై సామెత మనకు తెలియజేస్తుంది. ఇలాంటి సామెతలు వివిధ రకాల మనుషుల మనస్తత్వాలను విశ్లేషించేందుకు చక్కగా తోడ్పడుతాయి.

Share this Story:

Follow Webdunia telugu