Article General Knowledge %e0%b0%ae%e0%b0%a8 %e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86 %e0%b0%b2%e0%b1%8b%e0%b0%97%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81 108091500030_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన "గుండె" లోగుట్టు..!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ మానవుడు శరీరం గుండె మనిషి ప్రాణం గుండెకాయ అవయవం కాలేయం రక్తం పంపింగ్ రోజు
FileFILE
పిల్లలూ..! మానవ శరీరంలోని "గుండె"కు ఉన్న ప్రాధాన్యత ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఇది గనుక కొట్టుకోవడం ఆగిపోయిందంటే... మనిషి ప్రాణం కూడా పోయినట్లే..! అలాంటి గుండెకాయ సంగతేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!

మానవ శరీరంలోని మిగతా అవయవాలకంటే చాలా ఎక్కువ సంఖ్యలో పనిచేసే అవయవం "కాలేయం" అయినప్పటికీ... మన జీవిత కాలం మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే చాలా ఎక్కువగా పనిచేసే అవయవం మాత్రం "గుండెకాయే..!"

ఒక ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తాన్ని గుండె తన సామర్థ్యంతో రోజుకు కొన్ని వేలసార్లు రక్తనాళాలోనికి పంపుతుంది. అంటే... అది ఒక్కరోజులో సుమారు 25 వేల లీటర్ల రక్తాన్ని ఈ విధంగా శరీరంలోకి 'పంప్' చేస్తుందన్నమాట..!

ఆ సంగతలా ఉంచితే... ఒక మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కదా..! మరి ఆ లెక్కన అది ఒక గంటకు, రోజుకు, నెలకు, సంవత్సరానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆలోచించి చూడండి. ఉదాహరణకు మనం వందేళ్లు బ్రతుకుతామనుకుంటే... ఆ వందేళ్లలో మన గుండె సుమారుగా 3,66,00,000 సార్లు కొట్టుకుంటుంది.

అయ్యబాబోయ్..! మన గుండె అన్నిసార్లు మన రక్తనాళాల్లోకి రక్తాన్ని పంపిస్తుందా...? అని ఆశ్చర్యం వేస్తోంది కదూ...!

Share this Story:

Follow Webdunia telugu