Publish Date: Tue, 21 Feb 2012 (11:39 IST)
Updated Date: Tue, 21 Feb 2012 (11:39 IST)
వాతావరణంలో తేమతో కూడిన చిన్న చిన్న నీటి తుంపరలు మంచు కురిసేందుకు కారణమవుతాయి. ఈ బిందువులు భూ ఉపరితలంపైన కూడా వుంటాయి. గాలి చాలా తక్కువ పరిమాణంలోనే నీటిని మోయగలదు. వాతావరణంలో ఒక్కోసారి వచ్చే మార్పుల ఫలితంగా గాలి చల్లబడినప్పుడు ఆ కొద్దిపాటి సామర్థ్యాన్ని కూడా కోల్పోవడంతో వాటిని సన్న సన్నగా తుంపరల రూపంలో వాతావరణంలోకి నెట్టి వేస్తుంది. అదే పొగమంచుగా మనకు కనపడుతుంది.
దట్టమైన పొగమంచులో అవతలి వైపున ఉన్న వారిని స్పష్టంగా చూడటం కూడా కష్టంగా ఉంటుంది. సాధారణంగా మంచు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అదీ రాత్రిపూటే ఎక్కువగా కురుస్తుంది. తెల్లవారగానే సూర్యకిరణాల ప్రభావానికి మంచు కరిగి నేలమీద సన్నటి తుంపర్ల రూపంలో పడుతుంది.