Publish Date: Sat, 08 Dec 2007 (20:17 IST)
Updated Date: Sat, 08 Dec 2007 (20:09 IST)
ప్రశ్న : అకస్టిక్స్ శాస్త్రం దేనికి సంబంధించింది?
జవాబు : శబ్దాలను అధ్యయనం చేసేందుకు అకస్టిక్స్ శాస్త్రం ఉపకరిస్తుంది.
ప్రశ్న : యుద్ధాలలో తొలిసారిగా ఎయిర్ క్రాఫ్ట్‌ను దాడి చేసే ఆయుధంగా ఎప్పుడు ఉపయోగించారు
జవాబు : 1911 సంవత్సరంలో టర్కీ-ఇటలీ దేశాలకు మధ్య జరిగిన యుద్ధంలో తొలిసారిగా ఎయిర్ క్రాఫ్ట్‌ను దాడి చేసే ఆయుధంగా ఉపయోగించారు.
ప్రశ్న : రిఫ్రిజిరేటర్‌ను ఎవరు కనుగొన్నారు?
జవాబు : అమెరికాకు చెందిన అలెగ్జాండర్ ట్వైనింగ్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హారిసన్‌లు రిఫ్రిజిరేటర్ ఆవిష్కరణలో సంయుక్తంగా పాలు పంచుకున్నారు.