Publish Date: Thu, 24 Jul 2008 (15:56 IST)
Updated Date: Thu, 24 Jul 2008 (15:55 IST)
* చదవడం వలన ప్రయోజనం ఏమిటంటే... నలుమూలల నుంచి వచ్చే విఙ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి గుణ పాఠాలు తీసుకోవడం.
* స్వార్ధ త్యాగం, కృతనిశ్చయం, వినయ విశ్వాసాల వల్ల ఆత్మబలం చేకూరుతుంది.
* మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి. వీటిని అదుపులో పెట్టడానికి ఎంతో సహన శక్తి అవసరం.
* భయం వలన పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది.
* లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా ఊడిపోతుంది.
* ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించుకుంటూ వుంటే హక్కులను పొందుటకు అర్హులవుతారు.
* దుర్బల బాధల అనుభవం నిజాయితీకి ఒరిపిడిరాయి.
* నియమ బద్ద జీవితానికి కోర్కెలను జయించటం మొదటి మెట్టు అవుతుంది.
* ఆచరించటం కష్టమని మూలసూత్రాలను విడిచి పెట్టకూడదు. ఓర్పుతో వాటిని ఆచరించాలి.
* తనకు తాను తృప్తి పడే మానవుడు ఎప్పటికీ ఎదగలేడు.