Publish Date: Fri, 29 Aug 2008 (13:33 IST)
Updated Date: Fri, 29 Aug 2008 (13:24 IST)
పిల్లలూ..! సినిమాకెళ్ళినా, బీచ్‌కెళ్ళినా చిప్స్ ప్యాకెట్స్ కొనుకుని కరకరా నమిలేస్తుంటారు కదా...! ఆ చిప్స్‌ను వేటి నుంచి చేస్తారో తెలుసా...? బంగాళాదుంపల నుండి వాటిని తయారు చేస్తారు. అసలు ఈ బంగాళాదుంప కథా... కమామీషు ఏంటో తెలుసుకుందామా..?!
ఉర్లగడ్డ, ఆలుగడ్డ, బంగాళాదుంప అనే పేర్లతో పిలిచే ఈ దుంప అసలు మన దేశానికి చెందినదే కాదు. ఇది దక్షిణ అమెరికాలోని ఉత్తర ఆండీస్ పర్వతాల నుండి మనదేశానికి తరలి వచ్చింది. మొదట ఇన్‌కా జాతివారు ఈ దుంప వేరును కాపాడి ప్రత్యేకమైన పంటగా పెంచారు.
ఆ తరువాత 15వ శదాబ్దంలో యూరప్‌కి, 16వ శతాబ్దంలో మిగతా దేశాలకు ఈ బంగాళాదుంప తరలివచ్చింది. ఈ దుంపల పిండిని బట్టల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటినుండి గ్లూకోజ్, చక్కెర, పవర్ ఆల్కహాల్ కూడా తీస్తారు.
బంగాళాదుంపలలో అనేక రకాలున్నాయి. వీటి కోసం మనదేశంలో సిమ్లాలో పొటాటో ఇన్‌స్టిట్యూట్ కూడా ఏర్పడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు రకాల హైబ్రీడ్ వంగడాలను కూడా రూపొందించారు.