Publish Date: Mon, 19 Nov 2007 (20:14 IST)
Updated Date: Mon, 19 Nov 2007 (20:13 IST)
1. ఆక్సిజన్‌ను ఆవిష్కరించినది ఎవరు?
రంగు, వాసన లేనిదై భూమి పర్యావరణంలో 20 శాతం ఆక్రమించిన వాయు రూపంలో రసాయన మూలకమైన ఆక్సిజన్‌ను 1774లో జోసెఫ్ ప్రైస్ట్రే కనుగొన్నారు.
2. స్టెతస్కోప్‌ను ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు?
ఊపిరితిత్తులోని వాయు ప్రసారం తాలుకు ధ్వనులను వినేందుకు చెక్కతో నిర్మితమైన సిలిండర్‌ను ఫ్రెంచి వైద్యుడు రేనే థేయోల్ఫే లియేన్నెక్ 1816 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఛాతీకి అభిముఖంగా ఉంచే వృత్తాకారానికి అనుసంధానమైన చెవులకు అమరే విధంగా నిర్మితమైన సాగే గుణం కలిగిన గొట్టాలను సంతరించుకున్న ఆధునిక కాలపు స్టెతస్కోప్ 19 శతాబ్దంలో అభివృద్ధి చేయబడింది.
3. బ్రెయిన్ డెత్ అనగా ఏమిటి?
మెదడుకు కలిగిన గాయం కారణంగా మెదడు తనంతటతానే స్వతంత్రంగా పనిచేసే సదుపాయాన్ని కోల్పోవడాన్ని బ్రెయిన్ డెత్ అంటారు.