Publish Date: Mon, 28 Jul 2008 (16:56 IST)
Updated Date: Mon, 28 Jul 2008 (16:56 IST)
పొడవాటి కాళ్లు, అంతకంటే పొడవాటి మెడ, ఎప్పుడూ శత్రువులను గమనిస్తుండే పెద్ద కళ్లు, శరీరమంతా పెద్ద పెద్ద మచ్చలు.... ఈ జంతువేంటో గుర్తొచ్చిందా.... అదే జిరాఫీ. ఇంత పెద్దవైన జిరాఫీలు ఒక్కోటి ఎంత బరువుంటాయో తెలుసా...?! ఆ ఎంతుంటాయి... ఏ వందో, రెండువందల కేజీలో ఉంటాయంటూ ఈజీగా తీసిపారేయకండే....! అవి ఒక్కోటి 1000 కేజీల బరువుంటాయి.
జిరాఫీల జీవితకాలం 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల దాకా ఉంటుంది. ఇవి ఎక్కువ శాతం నిలబడుకునే నిద్రపోతాయి. వీటికి పొడవాటి మెడ ఉండటం వల్ల పెద్ద పెద్ద కొమ్మలను వంచి తమ పిల్లలకు ఆకులను అందిస్తాయి. ఇవి అకాకియ అనే మొక్కలను చాలా ఇష్టం తింటాయి.
అంతే కాదండోయ్...! వీటి వెంట సింహాలు పడ్డప్పుడు గంటకు 50 కిలోమీటర్ల చొప్పున పరుగెడతాయి. అన్ని జంతువుల కంటే పొడవైన జిరాఫీ మెడకు 7 ఎముకలు మాత్రమే ఉంటాయి. ఇకపోతే... అప్పుడే పుట్టిన బుల్లి జిరాఫీ 1.8 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ఒక్క సంవత్సరంలోనే రెండింతలుగా పెరుగుతుంది.