Article General Knowledge %e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d %e0%b0%8e%e0%b0%b2%e0%b0%be %e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf 108072900031_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెన్సిల్ ఎలా పుట్టింది...?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పిల్లలు స్కూలు డ్రాయింగ్ మాస్టర్ బొమ్మలు గీయడం బోర్డు సుద్దముక్క నోట్‌బుక్స్ పెన్సిల్
FileFILE
పిల్లలూ...! స్కూల్లో మీకు డ్రాయింగ్ మాస్టర్ బొమ్మలు గీయడం నేర్పుతున్నాడు కదా...! మాస్టర్ బొమ్మలను బోర్డుపైన సుద్దముక్కతో వేసి చూపిస్తే.... మీరు నోట్‌బుక్స్‌లో పెన్సిల్‌తోటి చకచకా బొమ్మలు గీసేస్తుంటారు కదూ...! మరి మీరు బొమ్మలు గీసే ఆ పెన్సిల్ ఎలా పుట్టిందో తెలుసా...?

ఇంగ్లాండ్ దేశంలో జేసెఫ్ డిక్సన్ అనే ఓ పేదవాడు ఇల్లు గడవటానికి ఓ చిన్న దుకాణంలో పనికి కుదిరాడు. యజమాని చెప్పింది గుర్తు పెట్టుకునేందుకు ఏంచెయ్యాలో తెలియక, ఓ నల్లటిరాయితో గోడమీద రాసుకున్నాడు. ఆ రోజు నుండీ క్రమం తప్పకుండా డిక్సన్ యజమాని చెప్పిన విషయాలను గోడమీడ ఆ నల్లరాయితో రాసుకునేవాడు. ఆ నల్లటి రాయి ఏంటో తెలుసా...? అదే "గ్రాఫైట్".
గ్రాఫైట్ నుండి పెన్సిల్...!
  పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో తయారు చేస్తారు. గ్రాఫైట్ అనేది కర్బన సమ్మేళనం, వజ్రం కూడా కర్బన పదార్థమే. అయితే వజ్రానికి ఉన్న కఠినత్వం గ్రాఫైట్‌కు లేదు. సన్నటి కొయ్య ముక్కలో చిన్న రంధ్రం చేసి అందులో గ్రాఫైట్‌ ముద్దను వేసి బాగా ఆరిన తరువాత...      


రోజులు అలా గడుస్తుండగా... డిక్సన్‌కు ఓ చిన్న ఆలోచన వచ్చింది. ఆ గ్రాఫైట్ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదం లాంటి పదార్థాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది కానీ... కాస్త బరువుగా ఉండి రాసేందుకు అంత వీలుకాలేదతడికి. అంతేగాకుండా చేతులు నల్లగా అయ్యేవి. దీంతో చాలా ప్రయోగాలు చేసిన తరువాత కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.

ఒక సన్నటి కొయ్యముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంధ్రాన్ని చేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను అందులో నింపి, బాగా ఎండిన తర్వాత రాశాడు డిక్సన్. అంతే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అద్భుతంగా రాస్తోంది అది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటక పోవడం, వేగంగా రాయడం లాంటి లక్షణాలు కలిగిన ఆ పెన్సిల్‌ను చూసి చాలా సంతోషపడ్డాడు డిక్సన్... ఇదీ పిల్లలు మన పెన్సిల్ పుట్టుక కథ...!

పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారని మీకు ఇప్పుడు అర్థమైంది కదూ...! గ్రాఫైట్ అనేది కర్బన సమ్మేళనం, వజ్రం కూడా కర్బన పదార్థమే. అయితే వజ్రానికి ఉన్న కఠినత్వం గ్రాఫైట్‌కు లేదు. ఇకపోతే... మొదట్లో పెన్సిళ్లు గుండ్రంగా వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో గురైన పెన్సిల్ రకరకాల ఆకారాల్లో వాడుకలోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu