Publish Date: Tue, 07 Oct 2008 (16:00 IST)
Updated Date: Tue, 07 Oct 2008 (15:59 IST)
ప్రశ్నలు :
1. కైకసి తండ్రి పేరేంటి?
2. ధృవుడి తండ్రి పేరేంటి?
3. మహాభారత యుద్ధం ఎన్నిరోజులు జరిగింది?
4. సట్లెజ్ నదికి పురాణ కాలంలో గల పేరేంటి?
5. విష్ణుమూర్తి చెవిలోని గులాబీలోంచి పుట్టిన ఇద్దరు రాక్షసులు ఎవరు?
6. భగీరథుడు కంటే ముందు గంగను భూమికి తెచ్చే ప్రయత్నం ఎవరెవరు చేశారు?
7. మన సంప్రదాయంలో శిశిర ఋతువు ఏ రెండు మాసములు ఉంటుంది?
8. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఒకే లింగంలో దర్శనమిచ్చే జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది?
9. ఒక పువ్వు ఆకారంలో ఉన్న వంద నక్షత్రాల కలయికను మనం ఏ నక్షత్రం అని పిలుస్తాము?
10. వేదాలలో చెప్పిన ఏడు నదులకంటే అన్నింటికన్నా తూర్పుదిశలో ఉండే నది ఏది?
జవాబులు :
1. సుమాలి
2. ఉత్తానపాదుడు
3. పద్దెనిమిది
4. శతదృ
5. మధు, కైటభులు
6. సగరుడు, అన్శుమనుడు, దిలీపుడు
7. మాఘం, ఫాల్గుణం
8. త్రయంబకేశ్వరం
9. శతభిషం
10. సరస్వతి