Publish Date: Sat, 30 Aug 2008 (10:46 IST)
Updated Date: Sat, 30 Aug 2008 (10:46 IST)
పిల్లలూ...! ఈజిప్టు దేశంలోని ఎత్తైన పిరమిడ్ల (మమ్మీల) గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువ ఎత్తుగా ఉండటమే గాకుండా, చాలా పెద్దగా కూడా ఉండే వాటిని మొట్టమొదటిగా డిజైన్ (నమూనా) చేసిందెవరో తెలుసా...?!
క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో ఇమ్‌హాటెప్ అనే అతను మొదటిసారిగా పిరమిడ్ నమూనాను తయారుచేసి ఇచ్చాడు. దాన్నే స్టెప్ పిరమిడ్ అంటారు. ఈజిప్టులోని సఖారా ప్రాంతంలో దాన్ని నిర్మించారు.
అరవై మీటర్ల ఎత్తు ఉండే స్టెప్ పిరమిడ్‌ను రూపొందించిన ఇమ్‌హాటెప్ బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేగాకుండా అతనో ఫిజీషియన్, రచయిత, పూజారి, ఖగోళ శాస్త్రవేత కూడా. ఎన్నో విద్యలను కలిగిఉన్న ఈయన రాజదర్భార్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.