Article General Knowledge %e0%b0%aa%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%97%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b %e0%b0%8e%e0%b0%b2%e0%b0%be %e0%b0%8e%e0%b0%97%e0%b1%81%e0%b0%b0 %e0%b0%97%e0%b0%b2%e0%b0%b5%e0%b1%81 108080500030_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్షులు గాలిలో ఎలా ఎగుర గలవు?

Advertiesment
బాల ప్రపంచం జనరల్ నాలెడ్జ్ పక్షులు గాలి ఆకాశం పిల్లలు శక్తి శరీర నిర్మాణం తేలిక ఎముకలు బోలు
FileFILE
పిల్లలూ...! పక్షులు ఆకాశంలో రివ్వుమంటూ ఎలా ఎగురుతున్నాయి? అసలు వాటికా శక్తి ఎలా వచ్చింది...? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పక్షుల శరీర నిర్మాణం తేలికగా ఉండటంతో అవి గాలిలో ఎగిరేందుకు అనువుగా ఉంటుంది. అలాగే వాటి ఎముకలు బోలుగా ఉండటం వల్ల గాలిలో ఎగిరినప్పుడు శరీరం తేలికగా మారేందుకు సహకరిస్తాయి.

పక్షులకు ఉండే రెక్కలు గాలిని వెనక్కు నెడుతూ ఉంటాయి. అదే క్రమంలో గాలిలో వాటి శరీరం బరువు కోల్పోయి, తేలికగా మారి ఎగిరేందుకు సహకరిస్తుంది.

ఒక్క రెక్కలు మాత్రమే కాదు, వాటి ఎముకలు, దంతాలు, గోళ్లు, జీర్ణవ్యవస్థ... ఇలా చెప్పుకుంటూ పోతే పక్షుల శరీరంలోని ప్రతిదీ ఒక్కో విధమైన ప్రత్యేకత కలిగి ఉండటం వల్ల గాలిలో ఎగిరేందుకు వీలయిన పరిస్థితులను కల్పిస్తాయి.

ఇకపోతే.... ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పరిశీలించి చూడటం వల్లే రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారన్న సంగతి మనకు తెలిసిందే కదా....!

Share this Story:

Follow Webdunia telugu