Publish Date: Mon, 25 Aug 2008 (13:45 IST)
Updated Date: Mon, 25 Aug 2008 (13:44 IST)
పిల్లలూ..! దేవుడికి హారతినిచ్చే కర్పూరం బిళ్లలను నీటిలో ముంచి వెలిగిస్తే వెలుగుతాయా..? వెలగవు కదా..! అలాగే మండుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా కూడా ఆరిపోతుంది. మరి కర్పూరాన్ని నీటిపై ఉంచి వెలిగిస్తే మండుతుందా...?!
జాగ్రత్తగా నీటిమీద ఉంచి వెలిగిస్తే కర్పూరం మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండటం వల్ల, అది నీటిపై గాలిలో ఉండటం వల్ల... గాలిలో ఉన్న ఆక్సిజన్ సహాయంతో కర్పూరం మండగలదు.
అలాగే... కర్పూరానికి ఉష్ణ వాహకత కూడా బాగా తక్కువగా ఉండటం వల్ల... నీటి చల్లదనం కర్పూరం ముద్దపై వెలుగుతున్న మంటను చల్లబరచి అది ఆరిపోయేలా చేసేంత శక్తి దీనికి ఉండదు.
కర్పూరం నీటిలో కరగదు. ఎందుకంటే.. ఇది ఒక టర్ఫీను జాతికి చెందిన సేంద్రీయ పదార్థం కాబట్టి. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ఒక ప్రత్యేక పద్ధతిలో అనుసంధానించుకుని ఉంటాయి.