Publish Date: Fri, 10 Oct 2008 (12:16 IST)
Updated Date: Fri, 10 Oct 2008 (12:15 IST)
పిల్లలూ... మానవుడి శరీరంలోని అంతస్రావీ గ్రంథులన్నింటినీ కలిపి అంతస్రావీ వ్యవస్థ (ఎండోక్రైన్ సిస్టమ్) అని అంటారు. అంతస్రావీ గ్రంథులను రెండు రకాలుగా విభజించారు. అవే నాళ గ్రంథులు, వినాళ గ్రంథులు. వీటి గురించి కాస్తంత వివరంగా తెలుసుకుందామా..?!
నాళ గ్రంథులు : వీటినే బహిస్రావీ గ్రంథులు లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. ఈ గ్రంథులకు 'నాళాలు' లేదా ట్యూబ్స్, డక్ట్స్ ఉంటాయి కాబట్టే నాళ గ్రంథులుగా పిలుస్తారు. వీటిలో తయారైన స్రావాలు వాటి నాళాల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అవుతాయి. ఉదాహరణకు కాలేయం, లాలాజల గ్రంథులను చెప్పుకోవచ్చు.
వినాళ గ్రంథులు : వీటినే అంతస్రావీ గ్రంథులు (ఎండోక్రైన్ గ్లాండ్స్ లేదా డక్ట్‌లెస్ గ్లాండ్స్) అని అంటారు. నాళాలు లేనందున వీటిలో తయారైన స్రావాలు రక్తం ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు సరఫరా అవుతాయి. ఈ గ్రంథులు విడుదల చేసే హార్మోన్లు మొదట రక్తంలోకి ప్రవేశించి ఆ తరువాత వివిధ అవయవాలకు చేరుతాయి.