Publish Date: Sat, 01 Nov 2008 (13:53 IST)
Updated Date: Sat, 01 Nov 2008 (13:52 IST)
పిల్లలూ...! "నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు" అనే ఈ సామెతను ఎప్పుడైనా విన్నారా...?! సిరిసంపదలు మనిషి మనస్తత్వంలో ఎలాంటి మార్పులను తెస్తాయో ఈ సామెత చెబుతుంది.
కొంతమంది స్వభావరీత్యా అహంకారులై ఉంటారు. అలాంటి వారికి ఏదో రకంగా ఆస్తులు అనేవి పెరిగాయంటే, వారిలో ఎక్కడలేని అహంకారం కూడా వచ్చి చేరుతుంది. మనిషి ఎంత ధనవంతుడైనా.. పేదవారిపట్ల జాలి, కరుణ చూపాలి. అప్పుడే సమధర్మం ఏర్పడి ప్రజల్లో ఐక్యత అనేది పెరుగుతుంది. అలాంటివారే ఈ సమాజానికి చాలా అవసరం.
ఆత్మీయబంధాలు సైతం, డబ్బుకు ప్రాధాన్యమిచ్చే నడమంత్రపు సిరి వచ్చి చేరినప్పుడు అవి పూర్తిగా విచ్చిన్నమవుతాయి. జీవితం మధ్యలో, అదీ కష్టపడకుండా డబ్బు చేకూరినవారిలో దుష్టశక్తులు ఆవహించినట్లుగా వెంటనే మారిపోతారు. కళ్లు నెత్తికెక్కడం అంటే ఇదే..! ఇలాంటి వారికి మంచీ, చెడూ కనిపించవని, ఎవ్వరూ ఈ రకంగా ఉండకూదని ఈ సామెత అర్థం.
నేడు డబ్బు పాత్ర ఎంతో పెరిగిపోయింది. డబ్బున్న వాడే మనిషి అన్నంతగా మనుషులు ఎదిగిపోయారు. కానీ ఈ ఎదుగుదల మానవ సంబంధాల్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోవద్దు.