Publish Date: Wed, 01 Oct 2008 (12:39 IST)
Updated Date: Wed, 01 Oct 2008 (12:38 IST)
పిల్లలూ..! మనం ఎక్కడున్నా సరే విడవకుండా కుట్టిన చోట కుట్టకుండా మరీ వేధించే దోమలు అసలు మనల్ని చూస్తాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే..! ఎందుకంటే వాటికసలు కళ్ళు అనేవే లేవు.
దోమలకు చెవులు కళ్ళుగా పనిచేస్తే... రెక్కలు చెవులుగా పనిచేస్తాయట...! వీటి సాయంతోనే అవి ఎదురుగా ఓ జీవి ఉన్నట్లు కనుగొంటాయట. అదెలాగంటే..? దోమలు తమ రెక్కల సాయంతో శబ్ద తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ శబ్ద తరంగాలు అలలు అలలుగా ప్రయాణం చేస్తాయి. ప్రయాణ మార్గంలో వాటికి ఏదైనా ప్రాణి అడ్డువస్తే అవి తిరిగీ వెనక్కి మళ్లి దోమను చేరతాయి.
అప్పుడు దోమ తనకు సమీపంలో మనుషులు లేదా ప్రాణమున్న ఏ ఇతర జీవులో ఉన్నట్లు తెలుసుకుని... చుట్టూ మూగి, గుయ్యిమన్న శబ్దంతో తమ ఉనికిని చాటుకుని మరీ... ప్రతాపాన్ని చూపిస్తాయి.