Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ది ఫస్ట్ టాలెస్ట్ టవర్!

Advertiesment
ఈఫిల్ టవర్
, బుధవారం, 22 ఫిబ్రవరి 2012 (05:45 IST)
ఈఫిల్ టవర్... ప్రపంచ పర్యాటక ప్రదేశాల జాబితా మొదటి పదిలో ఒకటి. ప్రపంచదేశాల ముందు ఫ్రాన్స్ సగర్వంగా తలెత్తుకోవడమే లక్ష్యంగా నిర్మించిన స్వాగత నిర్మాణం. ప్రపంచ వింత కాకపోయిన.... టాలెస్ట్ కన్‌స్ట్రక్షన్ ఇన్ ద వరల్ట్‌గా రికార్డుకెక్కిన కట్టడం...హిట్లరుకు అందని ద్రాక్షగానే మిగిలిన ఈ ఫ్యాషనబుల్ టవరే ఈ వారం మన గ్రేట్ మాన్యుమెంట్!

ఈఫిల్ టవర్ ఫ్రాన్స్‌ రాజధాని పారిస్ నగరంలో చాంప్‌ దే మార్స్ అనే ప్రదేశంలో ఉంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ నిర్మాణం.... పారిస్ నగరానికే కాక ఫ్రాన్స్ కూడా చిహ్నం. 1889లో రూపుదాల్చిన ఈ టవర్ నేటికీ ఫ్రాన్స్‌లో ఎత్తైన నిర్మాణం. దీనిని డిజైన్ చేసిన ఇంజనీరు గుస్తావె ఈఫిల్. అతడి పేరు మీదనే గుర్తింపు పొందింది.

1889లో పారిస్‌ నగరంలో ఎక్స్‌పొజిషన్ యూనివర్సెల్ ఎ వరల్డ్స్ ఫెయిర్ జరిగింది. ప్రపంచదేశాలన్నీ పాల్గొనే ఈ ఫెయిర్‌కు ముఖద్వారంగా దీనిని నిర్మించారు. దీని ఎత్తు 1,063 అడుగులు, (324 మీటర్లు). అంటే దాదాపు 81 అంతస్థుల భవనం ఎత్తు. ఈఫిల్ టవర్‌ను నిర్మించే నాటికి ప్రపంచంలో ఎత్తైన మానవ నిర్మితం రికార్డు వాషింగ్టన్ మాన్యూమెంట్‌ది. దానికంటే ఎత్తు నిర్మించాలన్న ఉద్దేశంతోనే ఈ టవర్ ఇంత ఎత్తకు ఎదిగింది. 1930లో న్యూయార్క్‌లో క్రిస్లర్ బిల్డింగ్ (ఎంపైర్ స్టేట్ బిల్టింగ్) కట్టే వరకు ప్రపంచంలో ఎత్తైన నిర్మాణంగా రికార్డు సొంతం చేసుకుంది.

ఫ్రాన్స్ ప్రభుత్వం చేజారిన రికార్డును తిరిగి సొంతం చేసుకోవడానికి 1957లో ఈఫిల్ టవర్‌పైన బ్రాడ్‌కాస్ట్ ఏంటె‌న్నాను ఏర్పాటు చేసి, క్రిస్లర్ బిల్డింగ్ కంటే ఎత్తు పెంచింది. దాంతో ఎత్తైన నిర్మాణం రికార్డును సొంతం చేసుకుంది. తర్వాత ప్రపంచంలో పెద్ద నిర్మాణాలు జరిగాయి. అయితే ఫ్రాన్స్‌లో
ఎత్తైన టవర్ ఇదే. ఏంటెన్నా ఎత్తును తొలగిస్తే ప్రాన్స్‌లో రెండవ ఎత్తైన నిర్మాణం అవుతుంది.

మొదటి స్థానంలో మిల్లవ్ వియాడక్ట్ ఉంది. 1887 నుంచి 1889 వరకూ నిర్మాణం సాగింది. మూడు వందలమంది పనిచేశారు. అత్యంత జాగ్రత్త చర్యలతో జరిగిన నిర్మాణంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu