Publish Date: Tue, 14 Oct 2008 (12:47 IST)
Updated Date: Tue, 14 Oct 2008 (12:45 IST)
పిల్లలూ...! డీవాల్యుయేషన్ అనే మాటను మీరెప్పుడైనా విన్నారా..? ఇతర దేశాల కరెన్సీ (డబ్బు) విలువకంటే మనదేశపు కరెన్సీ విలువ తగ్గడాన్నే "డీవాల్యుయేషన్" లేదా "విలువ తగ్గింపు" అని అంటారు.
ఒక దేశం విదేశీ వాణిజ్యానికి సంబంధించిన చెల్లింపుల సమయంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వం కరెన్సీ విలువను తగ్గిస్తుంది. దీనివల్ల ఆదేశపు ఎగుమతుల ధర కూడా తగ్గిపోతుంది.
దీనిని ఉదాహరణ పూర్వకంగా తెలుసుకోవాలనుకుంటే... మనం దేశంవారు ఒక యూఎస్ డాలర్‌ను పొందాలనుకుంటే... మనదేశపు కరెన్సీ 45 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అనుకుందాం. విదేశీ వాణిజ్యంలో సమస్యల వల్ల... మనదేశం రూపాయి విలువను తగ్గించినట్లైతే... అప్పుడు డాలర్‌కు 50 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇదే సమయంలో విదేశీయులు కూడా ఒక డాలరు మొత్తానికి మనదేశానికి చెందిన అనేకమైన వస్తువులను కొనగలుగుతారు. దీనివల్ల మన దేశానికి చెందిన ఎగుమతులు కూడా పెరుగుతాయి. అప్పుడు దేశంలో ధరలు పెరిగినందున దిగుమతులు తగ్గుతాయి.