Article General Knowledge %e0%b0%9f%e0%b1%86%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%8b%e0%b0%aa%e0%b1%8d %e0%b0%b5%e0%b0%af%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%a4 108092700041_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"టెలిస్కోప్" వయసెంత..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ విశ్వ రహస్యం టెలిస్కోప్ కీలకం పాత్ర వయసు సెప్టెంబర్ సంవత్సరం నెదర్లాండ్ హాన్స్ లిప్పర్షీ
FileFILE
పిల్లలూ... విశ్వ రహస్యాలను కనుక్కోవడంలో కీలకపాత్ర పోషించిన టెలిస్కోప్ వయసెంతో మీకు తెలుసా..? సెప్టెంబర్ 25, 2008 నాటికి ఈ టెలిస్కోప్‌కు 400 సంవత్సరాలు నిండాయి. అసలు ఈ టెలిస్కోప్‌ను ఎవరు రూపొందించారు? తదితర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం...!

మొట్టమొదటిసారిగా నెదర్లాండ్ దేశానికి చెందిన హాన్స్ లిప్పర్షీ 1608వ సంవత్సరంలో రెండు కటకాల సాయంతో టెలిస్కోప్‌ను రూపొందించారు. ఆ తరువాత 17వ శతాబ్దంలో గెలీలియో గెలీలి టెలిస్కోప్‌ను అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగించాడు. ఇక అప్పట్నించే టెలిస్కోప్‌కు విస్తృత ప్రాధాన్య లభించగా, ఆపై కొంతకాలానికే మనదేశంలోకి కూడా అడుగుపెట్టింది.

మొఘల్ సామ్రజ్యాధిపతి జహంగీర్‌కు ఓ ఆంగ్లేయ అధికారి టెలిస్కోప్‌ను బహుమతిగా ఇచ్చాడు. గూఢచర్యానికి ఉపయోగించే పరికరంగా అప్పట్లో దాన్ని భావించేవారు. అయితే దీని వినియోగంపై జహంగీర్ ఆసక్తి కనబరచకపోవడంతో అది అలంకార వస్తువుగానే మిగిలిపోయింది.

ఆ తరువాత 1786లో ఈస్టిండియా కంపెనీ తరపున భారత్‌కు వచ్చిన ఆంగ్లేయ అధికారి విలియం ఫ్రైస్ తన సొంత ఖర్చులతో తమిళనాడులోని, చెన్నై నగరంలో ఓ అంతరిక్ష పరిశోధనాశాలను ఏర్పాటు చేశారు. క్రమంగా ఈస్టిండియా కంపెనీ ఈ పరిశోధనా శాల బాధ్యతలను స్వీకరించి, పూర్తిస్థాయిలో వసతులు కల్పించింది.

Share this Story:

Follow Webdunia telugu