Article General Knowledge %e0%b0%9a%e0%b1%87%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81 %e0%b0%97%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf %e0%b0%aa%e0%b1%80%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b0%be%e0%b0%af%e0%b0%be 108080600030_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేపలు గాలి పీల్చుకుంటాయా...?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ నీళ్ళు చేపలు గాలి ప్రాణులు జీవరాశులు ఆక్సిజన్ ప్రాణవాయువు
FileFILE
నీళ్ళల్లో ఉండే చేపలు గాలిని ఎలా పీల్చుకుంటాయి? అనుకుంటున్నారా...! ఈ భూ ప్రపంచంపై ఉన్న ప్రాణులలాగే చేపలు కూడా గాలి పీల్చుకుంటాయి. అన్ని జీవరాశులకు ఆక్సిజన్ అవసరమైనట్లే వీటికి కూడా అవసరమే...!

అయితే, గాలి పీల్చుకునేందుకు ముక్కుకు బదులుగా చేపలకు రెండువైపులా మొప్పలు ఉంటాయి. ఆ మొప్పలపైన చిన్న చిన్న రక్తనాళాలు అనేకం ఉంటాయి.

ప్రాణవాయువైన ఆక్సిజన్ నీటిలో కూడా కరుగుతుందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆక్సిజన్ కరిగిన నీటిని చేప నోటినుంచి తీసుకుని మొప్పల ద్వారా బయటకు పంపేస్తుంది.

అప్పుడు నీటిలో కరిగిన ఆక్సిజన్‌ మొప్పలలో ఉండే రక్తనాళాల ద్వారా శరీరమంతటికీ చేరుకుంటుంది. కాబట్టే... చేపల మొప్పలు ఎప్పుడూ గాలి పీలుస్తున్నట్లుగా అటూ, ఇటూ కదలాడుతుంటాయి. వీటిని గనుక నీటి నుండి తీసి బైట వేశామంటే... ఊపిరాడక చనిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu