Publish Date: Mon, 14 Jul 2008 (13:32 IST)
Updated Date: Mon, 14 Jul 2008 (13:32 IST)
రాత్రిపూట ఆకాశంలో చంద్రుడిని చూసిన ప్రతిసారీ పెద్దగా, గుండ్రంగా కనిపించడని తెలిసిందే. నెల రోజుల కాలంలో ఒకసారి సగభాగమే కనిపించే చంద్రుడు, మరోసారి అసలు కనిపించనే కనిపించడు. ఇంకోసారేమో వంపు తిరిగి రేఖలా కనిపిస్తాడు. దీన్నే నెలవంక అని కూడా అంటారు.
ఇక చంద్రుడి కాంతిని వెలుగు అంటారని అందరికీ తెలిసిందే. అయితే నిజానికి ఈ వెలుగు చంద్రుడిది కాదు సూర్యుడి నుండి ప్రతిఫలించినది మాత్రమే. అలాగే, చంద్రుడు నిరంతరం రూపు మారుతూనే ఉంటాడు. అమావాస్య చంద్రుడి నుండి పున్నమి చంద్రుడిగా మారడానికి 29 రోజులు కాలం పడుతుంది.