Publish Date: Wed, 10 Sep 2008 (13:58 IST)
Updated Date: Wed, 10 Sep 2008 (13:23 IST)
పిల్లలూ...! భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడు... చంద్రుని నీడ భూమి మీద పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుందని తెలుసు కదా..! మరి చంద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...! |
| ఇలా జరిగేందుకు ఇంకో 50 కోట్ల సంవత్సరాల కాలం పడుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనయినా చంద్రుడు భూమి నుంచి దూరం జరిగే వేగం ఇంకా పెరిగినట్లయితే, అప్పుడు "గ్రహణాలు" లేని కాలం మరింత ముందుకు వస్తుంది. |
|
|
చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి అడ్డంగా వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపైన పడటంతో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్య గ్రహణంలోనూ, చంద్ర గ్రహణంలోనూ చంద్రుడి పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే... చంద్రుడు ఇప్పుడు మన భూమికి ఉన్నంత దూరంలో కాకుండా, ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నట్లయితే ఈ గ్రహణాలు ఏవీ సంభవించవు.
అదెలాగంటే... చంద్రుడు భూమికి ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు చంద్రుడి నీడ భూమిపై పడటంగానీ, భూమి నీడ చంద్రుడిపై పడటంగానీ జరగదు. దీంతో సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం లాంటివి ఏర్పడవు. ఇలాంటి గ్రహణాలు లేని రోజులు కూడా భవిష్యత్తులో రావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే... మనకు కనిపించినా, కనిపించక పోయినా చంద్రుడు మన భూమికి క్రమ క్రమంగా దూరం జరుగుతూ ఉన్నాడన్నది సత్యం. సంవత్సరానికి 4 సెంటీమీటర్ల చొప్పున చంద్రుడు భూమికి దూరమవుతున్నాడు. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమికి, చంద్రుడికి ఉండే సగటు దూరం మరో 4.6 శాతం పెరిగితే... ఎలాంటి గ్రహణాలు ఏర్పడే ఆస్కారం లేదు.
ఇలా జరిగేందుకు ఇంకో 50 కోట్ల సంవత్సరాల కాలం పడుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనయినా చంద్రుడు భూమి నుంచి దూరం జరిగే వేగం ఇంకా పెరిగినట్లయితే, అప్పుడు "గ్రహణాలు" లేని కాలం మరింత ముందుకు వస్తుంది.