Publish Date: Sat, 06 Sep 2008 (12:19 IST)
Updated Date: Sat, 06 Sep 2008 (12:18 IST)
పిల్లలూ..! చిన్నపాటి స్టాండుకి బిగించిన, నీలం రంగులో గిర్రున తిరుగుతుండే గ్లోబుల గురించి మీకు తెలిసే ఉంటుంది. స్కూళ్లలోనూ, గవర్నమెంటు ఆఫీసుల్లోనూ ఇవి తప్పకుండా ఉంటాయి కదా.. మరి ఈ గ్లోబును మొట్టమొదటగా ఎవరు తయారు చేశారో మీకు తెలుసా..?!
జర్మనీ దేశానికి చెందిన మ్యాప్ మేకర్ మార్టిన్ బెహాయిమ్ 1492వ సంవత్సరంలో మొదటిసారిగా గ్లోబును తయారు చేశాడు. నికోలస్ కోపర్నికస్‌ను స్ఫూర్తిగా తీసుకున్న మార్టిన్ తాను కూడా ఏదో ఒక పని చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. అందుకోసం ఎంతో కష్టపడి, అద్భుతమైన తెలివితేటలతో ఈ గ్లోబ్‌ను రూపొందిచాడు.
అసలు ఈ గ్లోబ్ వల్ల ఉపయోగం ఏంటి? అనే అనుమానం మీకు రావచ్చు. ఈ గ్లోబ్‌లో ప్రపంచ దేశాలన్నింటి చిరునామాలతో పాటుఅనేకమైన వివరాలను చూడవచ్చు.