Article General Knowledge %e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%a3 %e0%b0%a4%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b1%81 %e0%b0%b2%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 108092700029_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"కిరణ తుపాకు"లంటే...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ కిరణ తుపాకులు నిరసన కార్యక్రమం ఆందోళన అల్లరిమూక పోలీసులు భాష్పవాయు గోళాలు
FileFILE
పిల్లలూ...! ఇప్పటిదాకా ఏవేని నిరసన కార్యక్రమాల్లో ఆందోళనాకారులను, అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు, ఫిరంగులు లాంటి సాంప్రదాయక పరికరాలను మాత్రమే వాడుతారని మనందరికీ తెలుసు. అయితే ఇకపై వాటి స్థానాన్ని అత్యాధునికమైన "కిరణ తుపాకులు" భర్తీ చేయనున్నాయి. వాటి కథేంటో చూద్దామా..!

వెహికల్ మౌంటెడ్ యాక్టివ్ డేనియల్ సిస్టం (వీఎంఏడీఎస్)గా పిలిచే ఈ కిరణ ఆయుధం నుంచి 95 గిగా హెర్ట్జ్ తీవ్రత కలిగిన మైక్రో తరంగాలు వెలువడుతాయి. వీటిని అల్లరిమూకలవైపు తిప్పగానే వేడి తరంగాలు కాంతి వేగంతో సమానంగా వారిపైకి దూసుకెళ్తాయి. చర్మంపై పడ్డ ఐదు సెకన్లలోపే భరించలేనంత వేడిని పుట్టించి పరుగులు తీయిస్తాయి. పిల్లలూ.. ఇంతకూ ఈ ఆయుధం రేటు ఎంతో తెలుసా...?! 8 కోట్ల రూపాయలు మాత్రమే...!!!

కిరణ తుపాకులను ప్రయోగించిన వెంటనే క్షణాల్లో వారి ఒంట్లో వేడిని పుట్టించి పరుగులు పెట్టించటమే గాకుండా... పోలీసులు ఈ తుపాకులను ఎక్కడినుంచి ప్రయోగిస్తున్నారో కూడా తెలుసుకోలేరట. అమెరికా రక్షణశాఖ నిపుణులు తయారు చేసిన ఈ తుపాకులను మన దేశంలో కూడా ప్రవేశపెట్టే దిశగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu