Article General Knowledge %e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b2%e0%b1%87%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d %e0%b0%95%e0%b0%a5%e0%b0%be %e0%b0%95%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%b7%e0%b1%82 108081400022_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఎస్కలేటర్" కథా..! కమామీషూ...!!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం షాపింగ్ మాల్స్ మెట్లు ఎస్కలేటర్లు
పిల్లలూ... పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలోనూ, విమానాశ్రాయాల్లోనూ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనూ మనం మెట్లేక్కే అవసరం లేకుండా వాటంతవే కదులుతూ మనల్ని పైకి తీసుకెళ్తాయి కదా..! అవేంటో మీకు తెలిసే ఉంటుంది. వాటినే "ఎస్కలేటర్లు" అంటారు.

అసలు ఎస్కలేటర్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? దానిని ఎవరు కనిపెట్టారు? అది ఎందుకు ఉపయోగపడుతుంది? అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందామా...!?

మనం ఎక్కే అవసరం లేకుండా మెట్లే రయ్యి మంటూ పైకి వెళుతూ మనల్ని మోసుకెళ్ళే ఈ 'ఎస్కలేటర్'లను జెస్ డబ్ల్యు రెనో అనే అతను 1881వ సంవత్సరంలో కనిపెట్టారు. ఇతను ఓడ కళాసి. పెద్ద పెద్ద స్తంభాలు, నిచ్చెనలు చకచకా ఎక్కి దిగే జెస్‌కు అసలు మనం కదలకుండా మెట్లే పైకి కిందకి కదులుతూంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది.

ఆలోచన రావడం తక్షణం అనేక ప్రయోగాలు చేసి, ఏళ్ళతరబడి ఆలోచించి 'ఎస్కలేటర్' ప్రాథమిక రూపాన్ని తయారు చేశాడు డబ్ల్యు రెనో. ఆ తరువాత 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఎగ్జిబిషన్‌లో ఆ యంత్రానికి 'ఎస్కలేటర్' అనే మాటను వాడుకలోకి తీసుకొచ్చారు.

ప్రపంచంలోనే 'లిఫ్టు'లు తయారు చేయడంలో ప్రసిద్ది చెందిన 'ఓటిస్' అనే సంస్థ తొలి ఆధునిక ఎస్కలేటర్‌ను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది. ఎస్కలేటర్ పుట్టి వందేళ్ళు దాటిపోతున్నప్పటికీ... ఇప్పుడిప్పుడే మనదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్థ కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu