Article General Knowledge %e0%b0%86 %e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%86%e0%b0%b2%e0%b0%be %e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf 108091900039_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పేరెలా వచ్చింది..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ యాపిల్ కంపెనీ పేరు ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ హార్డ్వేప్ ఐఫోన్లు ఐపాడ్ కంప్యూటర్ ఉత్పత్తి స్టీవ్జాబ్
FileFILE
పిల్లలూ...! "యాపిల్ కంపెనీ" పేరు ఎప్పుడైనా విన్నారా..? ఎలక్ట్రానిక్ వస్తువులు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ లాంటి ఉత్పత్తులను చేసే సంస్థే ఇది. ఐఫోన్లు, ఐపాడ్‌లు, కంప్యూటర్లు లాంటి అనేక వస్తువులను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఈ సంగతలా కాసేపు పక్కన పెడితే....

అసలు ఈ యాపిల్ కంపెనీకి ఆ పేరెలా వచ్చిందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం... ఈ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్‌కు యాపిల్ అంటే చాలా చాలా ఇష్టం. మొదట్లో తన సంస్థకు ఓ మంచిపేరు దొరికేంతదాకా, తనకిష్టమైన యాపిల్‌ పేరుతోనే కంపెనీని నడిపించాలనుకున్నాడట.

అలా మూడు నెలలపాటు సంస్థను నడిపించినప్పటికీ స్టీవ్‌జాబ్‌కు యాపిల్‌కంటే మంచిపేరు దొరకలేదు. ఇక లాభం లేదనుకుని తన సంస్థలోని ఇతర భాగస్వాములను కూడా ఆయన ఓ మంచిపేరును సూచించాల్సిందిగా కోరాడు. వారు కూడా స్టీవ్‌కు నచ్చిన పేరును సూచించకపోవడంతో... "యాపిల్" పేరునే రిజిస్టర్ చేయించేశారట..! ఇదండ్రా పిల్లలూ...! యాపిల్ పేరు కథా... కమామీషు..!!

Share this Story:

Follow Webdunia telugu