Publish Date: Fri, 28 Mar 2008 (11:40 IST)
Updated Date: Fri, 28 Mar 2008 (11:35 IST)
ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలోకి దూసుకెళుతున్నారు. వాలెంటీనా తెరిస్కోవా అంతరిక్షంలో రాకెట్‌లా దూసుకెళ్లి మహిళలు పురుషులకు దేనిలోనూ తీసిపోరని నిరూపించింది. అంతరిక్షంలో అడగుపెట్టిన తొలి మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించింది.
రష్యాలోని మస్లెన్నికోవోలో 1937లో జన్మించిన తెరెస్కోవా జూన్ 16, 1963న అంతరిక్ష నౌక వోస్టక్ 6లో ప్రయాణించింది. దీనికి ముందే ఆమెకు ఆకాశంలో ప్రయాణించే అలవాటు మెండుగా ఉంది. అంతరిక్షంలో మూడు రోజులు గడిపిన తర్వాత భూమికి తిరిగివచ్చింది. ఈమె ప్రయాణించిన నౌక రష్యా విజ్ఞాన బృందంగా పిలిచారు.
ఇందులో ఈమెతో పాటు అంతరిక్షంలో తొలి సారిగా అడుగిడిన యూరీ గగారిన్, మొదటి కుక్క లైకాలు కూడా ఉన్నాయి. 1963లో సహ వ్యోమగామి అయిన ఆండ్రియన్ నికోలేవ్‌ను వివాహమాడింది. వీరికి కుమార్తె కూడా ఉంది.